బెంగాల్ లో అసలు లేదు అని భావించిన కరోనా వైరస్ వేగంగా పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇక ఇది పక్కన పెడితే పశ్చిమబెంగాల్‌లో ఈనెల 30 వరకూ కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆంక్షలు పెంచుతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత ప్రకటించారు. 

 

ట్రావెలింగ్ కారణంగానే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయన్నారు ఆమె. కరోనా పోరాటంలో 20 మంది పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికులు  బెంగాల్‌లో చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అయితే  రాష్ట్రానికి చెందిన వారు మాత్రం బయట సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: