ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే మరో సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జగనన్న చేదోడు పథకం కింద నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు  ఈ పథకం వర్తిస్తుంది. 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.247.04 కోట్లు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తమకు ఓటు వేయని వాళ్లకు కూడా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని సిఎం జగన్ పేర్కొన్నారు. 

 

ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ది దారులతో నేరుగా మాట్లాడారు. ఎవరికి అయిన అందకపోయినా సరే సాయం చేస్తామని చెప్పారు. షాపులు ఉన్న రజకులకు నాయి బ్రాహ్మణులకు ఈ సహాయం అందుతుంది అని సిఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో  ఉన్న హామీ మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: