ఓడిశాలో కరోనా కేసులు కట్టడి అయినట్టే అయి ఒక్కసారిగా భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ కరోనా కట్టడికి సమర్ధవంతంగా చర్యలు తీసుకుంటున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక ఒడిశాలో నిన్న 143 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. 

 

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5303 కు చేరుకుందని రాష్ట్ర సర్కార్ పేర్కొంది.  వీరిలో 3720 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. 1562 క్రియాశీల కేసులు రాష్ట్రంలో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక అక్కడ కరోనా కట్టడికి కాస్త కఠినంగానే నిర్ణయాలు తీసుకుని పలు ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: