తెలంగాణ‌లో క‌రోనా ప్ర‌తి నిమిషానికి విజృంభిస్తోంది. ఇప్పుడు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌తి రెండు నిమిషాల‌కు అక్క‌డ ఓ పాజిటివ్ కేసు న‌మోదు అవుతోంద‌ని చెపుతున్నారు. ప్ర‌ధానంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే కేసులు ఎక్కువ న‌మోదు అవుతున్నాయి. ఇక్క‌డ కూడా హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో టెస్ట్‌లు కూడా పెంచారు. టెస్ట్‌లు పెంచడం వల్లే కేసులు పెరుగుతున్నాయనేది అధికారుల వాదన.

 

విప‌క్షాలు మాత్రం తెలంగాణ అంతటా క‌రోనా టెస్టుల సంఖ్య పెంచాల‌ని.. అప్పుడు మ‌రిన్ని కేసులు న‌మోదు అవుతాయ‌ని అంటున్నారు. ఇక హైదరాబాద్‌కు ఇత‌ర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్ర‌జ‌లు, ఉద్యోగులు, వ్యాపారులు, వ‌ల‌స కూలీలు రావ‌డంతోనే ఇక్క‌డ ఎక్కువుగా కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే చెన్నై తరహాలో ఇక్కడ 14 నుంచి 21 రోజుల లాక్‌డౌన్‌ అవసరమనేది నిపుణుల మాట. ఇప్పటికే ఏపీలో మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు. 50 నుంచి 100 కేసులు నమోదు కావడంతో అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఏదేమైనా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక‌పోతే తెలంగాణ మ‌రో మ‌హారాష్ట్ర‌ను త‌ల‌పించేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: