కేంద్ర మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తీసుకుని వస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం తో... ఆర్బిఐ పరిధిలోకి 1540 సహకార బ్యాంకు లు రానున్నాయి అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 

 

8 కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులకు భరోసా కల్పించినట్లు అవుతుందని ఆయన అన్నారు. 4 లక్షల 54 వేల  కోట్లు విలువైన డిపాజిట్ లు భద్రంగా ఉంటాయని ఆయన వివరించారు. ఇక ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: