ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు మిడతలు చుక్కలు చూపిస్తున్నాయి. పోయినట్టే పోయిన మిడతలు ఇప్పుడు భారీగా ఉత్తరాది రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజు రోజుకి పరిస్థితి భయంకరంగా మారుతుంది అంటూ ఆ రాష్ట్రాల రైతులు ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు. తాజాగా  ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలో మిడతలు పెద్ద ఎత్తున దాడి చేసాయి. 

 

దీనితో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనితో డ్రోన్ల ద్వారా పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎన్. సింగ్ మాట్లాడుతూ, "సుమారు 60% మిడుతలు చంపెసామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 డ్రోన్లను పురుగుమందుల పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: