హైదరాబాద్ లో భారీ వర్షాల దెబ్బకు రోడ్లు అన్నీ కూడా గత పది రోజుల నుంచి భారీగా దెబ్బ తినే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు దెబ్బకు రోడ్లు అన్నీ కూడా కంకర పైకి  కనపడే పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో పాత బస్తీలో ఫలక్ నుమాలో భారీ ప్రమాదం తప్పింది. రైల్వే బ్రిడ్జ్ మీద పెద్ద హోల్ పడింది. ఆరు ఇంచులు మధ్యలో కూలిపోయింది వంతెన.

భారీ వర్షానికి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న అధికారులు... చర్యలు తీసుకుంటున్నారు. రైల్ పట్టాలపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు కిందకు చేరుతుంది. వెంటనే అప్రమత్తమై రైల్వే అధికారులు... రైళ్ల రాకపోకలు  నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జ్ పై వాహనాలను మళ్ళిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: