ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమాలకు‌ విరుద్ధంగా చర్చ ల్లో పాల్గొంటున్నారంటూ లంకా దినకర్ పై  వేటు వేసారు. బిజెపి నుంచి సస్పెండ్ చేసినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి ఆఫీస్ సెక్రటరీ శ్రీనివాసరావు పేరుతో దినకర్ కు సస్పెన్షన్ లేఖ పంపించారు. పార్టీ నిర్ణయాలు, నియమావళి, ఆదేశాలను ధిక్కరించినందుకు సస్పెండ్‌ చేశాం అన్నారు.

పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పాల్గొంటున్నారని ఆయన ఆరోపించారు. జులై 26 జరిగిన మీడియా చర్చలో పాల్గొన్నందుకు  నోటీసులు ఇచ్చాం అని అన్నారు. సరైన వివరణ ఇవ్వని కారణముగా పార్టీ నుండి సస్పెండ్ చేశామని చెప్పారు. గతంలో జారీచేసిన షోకాజ్‌ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా..  మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొన్నాంటున్నారనే ఈ చర్య తీసుకున్నాం అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: