దేశంలోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ధర్మాసనానికి ఈ విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.తమిళనాడు సేలంలోని వినాయక మిషన్ యూనివర్సిటీ సేవల్లో లోపాలున్నాయంటూ మను సోలంకీ, ఇతర వైద్య విద్యార్తులు దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలు ఆలకించింది.


జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్​సీడీఆర్​సీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీలుపై ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని విశ్వవిద్యాలయం తరపున హాజరైన న్యాయవాది సౌమ్యజిత్​ను కోర్టు ఆదేశించింది.విద్యాసంస్థల సంబంధిత కేసుల్లో సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించింది. విద్య అనేది వస్తువు కాదని, విద్యా సంస్థలు సేవలను అందించవని మహర్షి దయానంద్ యూనివర్సిటీ, పీటీ కోషి కేసులో తీర్మానించింది. ప్రవేశాలు, ఫీజుల విషయంలో సేవల ప్రస్తావన ఉండదని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: