ఏపీ తెలంగాణా సరిహద్దు వద్ద బస్సులను ఏర్పాటు చేసామని ఏపీ రవాణా శాఖా మంత్రి పెర్ని నానీ పేర్కొన్నారు. పంచలింగాల గరికపాడు చెక్ పోస్ట్ వద్ద విరివిగా బస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాబట్టి సరిహద్దుల వద్దకు వచ్చి బస్సులు ఎక్కాలని ఆయన సూచించారు. జూన్ 18 నుంచి తెలంగాణా ఆర్టీసీ తో చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు.

అయినా సరే ఇంకా ఎలాంటి ముందు అడుగు పడలేదని ఆయన వివరించారు. తెలంగాణా ఆర్టీసీ కి సెలవలు కారణంగా చర్చలు జరగడం లేదని వివరించారు. దసరా నేపధ్యంలో ఇప్పుడు బస్సుల విషయంలో ఏపీ సర్కార్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ సమయాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా కాస్త క్యాష్ చేసుకుంటున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఎప్పుడు మొదలవుతాయో చర్చలు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: