రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో
ముంబయి ఇండియన్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్.. 18.2ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్(107) అర్ధశతకంతో మెరవగా, సంజూ శాంసన్(54) అర్థ శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వారు విఫలమయ్యారు. ఈ విజయంతో ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకున్నట్లే.
ముంబయి బౌలర్లలో జేమ్స్ ప్యాటిన్స్న్ రెండు వికెట్లు తీశాడు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి...రాజస్థాన్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా హార్దిక్ పాండ్య (60*; 21 బంతుల్లో 2×4, 7×6) సూర్యకుమార్ యాదవ్ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్ కిషన్ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్ తివారి (33*; 23 బంతుల్లో 4×4, 1×6) బ్యాటింగ్‌లో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్(2), జోఫ్రా ఆర్చర్(2), కార్తీక్ త్యాగీ (1) వికెట్ తీశారు.