ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై కొత్త జీవో విడుదల చేసింది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.  పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని జీవోలో స్పష్టం చేసింది ఏపీ సర్కార్. గతంలో మాదిరిగా 3 మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతి లేదు అని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుంది అని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులు అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో నెంబర్ 310ని ఎక్సైజ్ శాఖ విడుదల చేయడంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: