బిహార్​లో మహా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. బిహార్​లోని దర్భంగ, ముజఫర్​పుర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. తేజస్వీ 10 లక్షల ఉద్యోగాల హామీని ప్రస్తావిస్తూ పదునైన వ్యాఖ్యలతో మోదీ ధ్వజమెత్తారు.బిహార్​కు ప్రస్తుతం రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయని మోదీ అన్నారు.

 ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కాగా.. రెండోది రాష్ట్రాన్ని రోగగ్రస్థంగా మార్చిన శక్తుల నుంచి ముప్పు ఉంది. ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఎన్​డీఏకు ముందు లాలూ-రబ్​రీ దేవి 15 ఏళ్ల పాలనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. అబద్ధాలు, మోసం, గందరగోళంలోనే వారి ప్రభుత్వం కొనసాగిందన్నారు. బిహార్​ అభివృద్ధి కోసం వారి వద్ద ఎలాంటి ప్రణాళిక కానీ, అనుభవం కానీ లేవన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: