ఇండియన్ క్రికెట్ టీం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం టీమ్ ఇండియా యూఏఈ నుంచి నేరుగా సిడ్నీ పయనం కానుంది. ఇక ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ని తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ విడుదల చేసింది. కోవిడ్ నేపథ్యంలో వన్డే, టీ20లను కేవలం రెండు స్టేడియం ల వరకే పరిమితం చేయగా నాలుగు టెస్టులకు మాత్రం వేర్వేరు వేదికలు సిద్దం చేసింది ఆస్ట్రేలియా బోర్డ్. డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు అడిలైడ్ లో జరగనుంది . అలానే డే అండ్ నైట్ ఫార్మాట్‌లో పింక్ బాల్ టెస్టు నిర్వహించనున్నారు.

నవంబర్ 27: మొదటి వన్డే (సిడ్నీ)
నవంబర్ 29: రెండవ వన్డే (సిడ్నీ)
డిసెంబర్ 2: మూడవ వన్డే (కాన్బెర్రా)
డిసెంబర్ 4: మొదటి టి 20 ఐ (కాన్బెర్రా)
డిసెంబర్ 6: రెండవ టి 20 ఐ (సిడ్నీ)
డిసెంబర్ 8: మూడవ టి 20 ఐ (సిడ్నీ)
డిసెంబర్ 6-8: వార్మ్-అప్ గేమ్ (సిడ్నీ)
డిసెంబర్ 11-13: వార్మ్-అప్ గేమ్ - డి / ఎన్ (సిడ్నీ)
డిసెంబర్ 17-21: మొదటి టెస్ట్ - డి / ఎన్ (అడిలైడ్)
డిసెంబర్ 26-30: రెండవ టెస్ట్ (మెల్బోర్న్)
జనవరి 7-11: మూడవ టెస్ట్ (సిడ్నీ)
జనవరి 15-19: నాల్గవ టెస్ట్ (బ్రిస్బేన్)

మరింత సమాచారం తెలుసుకోండి: