కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ను భారతీయులు అందరికి వేస్తామని ఎవరికి వ్యాక్సిన్ అందకుండా ఉండే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోడీ  స్పష్టమైన హామీ ఇచ్చారు. టీకాకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక కోసం అలాగే వ్యాక్సిన్ అందించే మార్గాన్ని రూపొందించడానికి జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. ది ఎకనామిక్ టైమ్స్‌తో ఒక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేసారు.

“టీకా అందుబాటులోకి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తామని నేను దేశానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరూ వెనుకబడి ఉండరు.” ఆయన అన్నారు. “వాస్తవానికి, మొదట్లో మేము చాలా వరకు ప్రమాదం ఉన్న వారికి మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడంపై దృష్టి పెట్టవచ్చు. కోవిడ్ -19 కోసం వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై జాతీయ నిపుణుల బృందం ఏర్పాటు చేసామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: