ఈ మధ్య కాలంలో ఆర్ధిక ఇబ్బందులతో తల్లి తండ్రులు చిన్న పిల్లలను అమ్ముకునే ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేని చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం లేదా చిన్న పిల్లలను అమ్ముకోవడం దత్తత ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఎంత అవగాహన కల్పించినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు.

తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మోర్తాడ్ లో శిశువు విక్రయం ఘటన సంచలనం అయింది. కన్న బిడ్డను 15 వేలకు అమ్మకానికి పెట్టింది తల్లి పద్మ... కుటుంబ పోషణ భారంగా మారడంతో బిడ్డను అమ్మాలి అని తల్లి నిర్ణయం తీసుకుంది. పోలీసుల సహకారం తో విక్రయించిన శిశువు ను స్వాధీనం చేసుకున్న ఐసిడిఎస్ అధికారులు.... ఆమెకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: