నెల్లురులోని విడవలూరులో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రముఖ కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో పార్కు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక.. ఆపార్కు నిర్ణయాన్ని పక్కన పడేసి నిర్మాణాన్ని నిలిపివేశారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతంలో ప్రస్తుతం సచివాలయ భవన నిర్మాణం చేపట్టడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఆగ్రహించిన పుచ్చలపల్లి అభిమానులు, కమ్యూనిస్టు పార్టీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ అభిమాన నేత పేరున నిర్మించ తలపెట్టిన పార్కును నిలిపివేసి సచివాలయం కట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

నిరంతరం ప్రజాసమస్యలపై  పోరాటం చేస్తూ.. నిరాడంబర జీవితం గడిపిన ప్రముఖనేత పుచ్చలపల్లి అని గుర్తుచేశారు. ప్రజల తరఫున తన గళాన్ని వినిపించిన అలాంటి నాయకుడిని వైసీపీ ప్రభుత్వం అవమానించడం తగదన్నారు. సచివాలయ భవననిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సగంలో నిలిపివేసిన పుచ్చలపల్లి పార్కును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్కు నిర్మంచలేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: