భారత్-చైనా సరిహద్దు లో భారీగా ఉగ్రవాదులు ప్రవేశించి అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి నిఘా వర్గాలు కేంద్ర రక్షణ శాఖకు ఒక నివేదిక కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  పాకిస్థాన్ కు చెందిన కొంతమంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఉన్న చల్లటి వాతావరణాన్ని అనువుగా చేసుకుని భారత్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

 దీంతో ఇప్పుడు భారత ఆర్మీ కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అంతే కాకుండా ఇతర దేశ సరిహద్దులను కూడా పటిష్టం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలను పంపిస్తుంది పాక్. గత కొంతకాలంగా ఈ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోకి ఉగ్రవాదులను సరిహద్దుల్లో ఉన్న పెద్ద ఎత్తున పంపాలి అని భావిస్తోంది. అయితే అందుకు అనుగుణంగా పరిస్థితులు లేకపోవడంతో సుదీర్ఘమైన చైనా సరిహద్దు నుంచి పంపించే ఆలోచన చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: