పోలవరం విషయం లో రాజకీయ విబేదాలు విడిచిపెట్టాలి అని సిపిఐ రామకృష్ణ అన్నారు. పోలవరం రాష్ట్ర ప్రజలందరికి అవసరం అన్నారు. పోలవరం ఎత్తుతగ్గితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కి నీరు ఇవ్వడం కష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపిలో ఏ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదు అని, పోలవరం ప్రాజెక్టు ను ఎవ్వరూ చూడకూడదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి అనిల్ అనుమతితోనే పోలవరం బయులుదేరితే అరెస్టు లు చేశారని ఆయన విమర్శించారు. మంత్రి అనిల్ మాటలకే ప్రభుత్వంలో విలువ లేదు అన్నారు.

ఏపిలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉంది అని మండిపడ్డారు. మంత్రి అనిల్ కు పోలవరం గురించి ఏమైనా తెలుసా.....? అని నిలదీశారు. 1946 లోనే పుచ్చలపల్లి సుందరయ్య గోదావరి ప్రాజెక్టు కట్టాలని చెప్పారు అని, మంత్రి అనిల్, వారి పార్టీలు పుట్టక ముందే పోలవరం గురించి ప్రయత్నించింది సిపిఐ అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అమరావతి చంద్రబాబు అజెండా అని చెప్పే పెద్దమనుషులు అసెంబ్లీ లో గడ్డి పికారా...? అని ప్రశ్నించారు. వైకాపా నేతలకు చంద్రబాబు ఫోబియా పట్టుకుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: