గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఎన్నికల వేళ టి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.శాసనమండలి మాజీ చైర్మెన్,టి‌ఆర్‌ఎస్ సీనియర్ నేత అయిన స్వామి గౌడు బి‌జే‌పి తీర్థం పుచ్చుకున్నారు.ఆయన  బుధవారం టి‌ఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పి భారతీయ జనతాపార్టీలో చేరారు. 

ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామి గౌడ్‌.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి స్వామి గౌడ్‌ను జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు.జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల వేళ సీనియర్ నేత పార్టీ మారడంతో టి‌ఆర్‌ఎస్ కు గట్టి షాక్ తగిలినటైంది.

 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ గట్టిగానే భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ఎప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది.మరోవైపు  ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది.మరి తమ వ్యూహాలను అమలు చేస్తూ వెలుతున్న బి‌జే‌పి ఏ మేర విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: