దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. మూడురోజుల ఏసీబీ సోదాల్లో వెలుగు చూసిన అవినీతి అక్రమాల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఏసీబీ నివేదిక ఆధారంగా దేవదాయశాఖ కమిషనర్ అర్జునరావు ఈ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 7 విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్ లు,8 మంది సిబ్బంది సస్పెండ్ అయ్యారు. అన్నదానం,టిక్కెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇచ్చారు.

స్టోర్స్,హౌస్ కీపింగ్,అన్నదానం,షాపుల లీజు,సూపర్ వైజింగ్ విభాగాల సూపరింటెండెంట్ లు సస్పెండ్ అయ్యారు. దర్శన టిక్కెట్లు,ప్రసాదాల విభాగం,చీరలు,ఫోటోల విభాగంలో సిబ్బందిపై సస్పెన్షన్ సూపరిడెంట్ అమృతరావు, భాగ్యజ్యోతి, చందు శ్రీనివాస్, హారికృష్ణ, శ్రీనివాసమూర్తి ని సస్పెండ్ చేయగా గుమస్తాలు శారీస్ సెక్షన్ మధు, పాతపాడు నాగేశ్వరరావుని సస్పెండ్ చేసారు. ఫోటో కౌంటర్ రాంబాబు, టిక్కెట్లు కౌంటర్ పి రవి, డోనేషన్ కౌంటర్ కె రమేష్, లడ్డు కౌంటర్లు కొండలు ని సస్పెండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: