కేంద్ర మంత్రి మురళీధరన్‌ కారుపై దాడి జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని వెస్ట్‌ మిడ్నాపూర్‌ పంచ్‌క్కుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.   వెస్ట్ మిడ్నాపూర్ పంచ్‌క్కుడిలో ముర‌ళీధ‌ర‌న్ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేయ‌డంతో.. అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ దాడిలో త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికి గాయాల‌య్యాయ‌ని ముర‌ళీధ‌ర‌న్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్య‌క‌ర్త‌లే దాడి చేసిన‌ట్లు కేంద్ర‌మంత్రి ఆరోపించారు.  తన కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు ఆయన తెలిపారు. దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలవడంతో పాటు కారు అద్దాలు ధ్వంసమైనట్లు మురళీధరన్‌ వివరించారు. ఈ నేప‌థ్యంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర మంత్రి ర‌ద్దు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: