గోవాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున  గోవా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్‌ రాణే తెలిపారు. అయితే,  ఘటన నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రిప ప్రమోద్‌ సావంత్‌ ఆసుపత్రికి వెళ్లారు. "మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత, కొవిడ్‌ వార్డుల్లోకి సరఫరా మధ్య జరిగిన ఆలస్యం కారణంగా రోగులకు సమస్యలు ఎదురై ఉండొచ్చు" అని సీఎం అన్నారు. ఇదిలా ఉండగా.. నిన్న ఆసుపత్రికి 1200 జంబో ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉండగా.. కేవలం 400 సిలిండర్లు మాత్రమే సరఫరా అయినట్లు రాష్ట్ర మంత్రి రాణే  చెప్పారు. ఘటనకు హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: