అసలే కరోనాతో ప్రజలు వణికిపోతుండగా, ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ ఒకటి వెలుగులోకొచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్–19 నుంచి కోలుకున్న వారిలో ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు. ఇక మహారాష్ట్రలోనూ దాదాపు 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ముందుజాగ్రత్తగా అక్కడి మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే పేర్కొన్నారు. ఈ బాధితులకు పలు విభాగాల చికిత్స అవసరం అవుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: