దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు త‌గ్గిన కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,720 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 4136 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ తరుణంలో చాలాచోట్ల విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో శ్మశానవాటికలన్నీ నిండిపోతున్నాయి. నిరంతరం 24 గంటలపాటు కాటికాపరులు మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలో శ్మశానవాటికల్లో పనిచేస్తున్న కాటికాపరులందరినీ కరోనా యోధులుగా గుర్తిస్తూ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కాటికాపరులు శ్మశానవాటికలో విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేస్తామని సీఎం వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: