పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వార్త ఇది.  పవర్ స్టార్ 28 వ సినిమా పవన్ కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ని రామ్ చరణ్ తో నిర్మించిన మైత్రి మూవీ మేకర్ స్ సంస్థ దీన్ని సెట్ చేసుకోవడం మరో విశేషం. హరీష్ శంకర్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం. తమ హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు మ్యానరిజంని సెట్ చేసి గూస్ బంప్స్ ఇచ్చిన దర్శకుడిగా అతని మీద మంచి గురి ఉంది. దాని తర్వాత హరీష్ శంకర్ సైతం గబ్బర్ సింగ్ ని మించే భారీ హిట్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ సినిమాలో లెక్చరర్‌గా నటిస్తున్నారట. దీని కోసం మేకర్స్ భారీ కళాశాల సెట్‌ను కూడా నిర్మిస్తున్నారట. పవర్ స్టార్ 28 వ సినిమా లో.. పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా మనకు కనిపించబోతున్నారు అంటూ ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: