ఆంధ్రప్ర‌దేశ్ సీఎం వైఎస్  జ‌గ‌న్ ఈరోజు విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ స‌మావేశంలో రాష్ట్రంలో నిర్వ‌హించబోయే ఇంట‌ర్ మ‌రియు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన తేదీల‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలకు ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని అంటున్నారు. 


మొత్తం 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే  సెప్టెంబర్ 2లోగా పరీక్షా ఫలితాలు వెల్లడించేలా ప్రణాళికలు సిద్దం చేశారని అంటున్నారు. ఇక  సీఎం జగన్ సమీక్షలో తుది నిర్ణయం ఏమి తీసుకుంటారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: