ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో తొలి సెషన్ లో కాస్త అటు ఇటూగా ఇబ్బంది పడిన న్యూజిలాండ్ బౌలర్ లు రెండో సెషన్ లో మాత్రం దుమ్ము రేపుతున్నారు. టీం ఇండియా వీక్ నెస్ మీద కొడుతున్నారు కీలక బౌలర్ లు అందరూ కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇప్పటికే మూడు కీలక వికెట్ లు తీసిన కీవీస్ బౌలర్ లు మ్యాచ్ పై పట్టు బిగించారు అనే చెప్పాలి.

ఇక టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ విషయానికి వస్తే కాస్త ఒత్తిడిలో కనపడుతున్నాడు అనేది అర్ధమైంది. న్యూజిలాండ్ బౌలర్ లు కాస్త దూకుడుగా బౌన్సర్ లు వేయడంతో ఇబ్బంది పడుతున్నట్టే కనపడింది. 40 వ ఓవర్ లో కోహ్లీ కీపర్ క్యాచ్ గా వెనుతిరిగినట్టే కనపడింది. బౌల్ట్ విసిరిన లెగ్ సైడ్ బంతిని కోహ్లీ ఆడబోయాడు. ఈ క్రమంలో అది కీపర్ చేతిలోకి వెళ్ళగా అప్పీల్ చేస్తే నాట్ అవుట్ ఇవ్వగా న్యూజిలాండ్ రివ్యూకి వెళ్ళింది. నాట్ అవుట్ గా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: