మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. విభిన్న ప్ర‌తిభావంతుడైన ప్ర‌కాష్‌రాజ్ మా అధ్య‌క్షుడిగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలోని అన్ని చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోల్చిన‌ప్పుడు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ చాలా పెద్ద‌ద‌ని,  స‌మ‌స్య‌లు కూడా అలాగే ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మాకు సొంత భ‌వ‌నం లేద‌ని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముందుగా సొంత భ‌వ‌నం నిర్మిస్తాన‌న్నారు. చిరంజీవితో త‌న‌కు ఎంతో సాన్నిహ‌త్యం ఉంద‌ని, ఆయ‌న అంద‌రివాడ‌ని, అయితే ఆ సాన్నిహిత్యాన్ని ఈ ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించుకోన‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఒక‌ప్పుడున్న పేరు ఇప్పుడు లేద‌ని, పూర్వవైభ‌వాన్ని తాను తీసుకొస్తాన‌న్నారు. మంచి వ్య‌క్తిత్వం, మంచి హృద‌యం క‌లిగిన న‌టులు ఎంద‌రో తెలుగులో ఉన్నార‌ని, సినీ కార్మికుల‌కు స‌హాయం చేసేందుకు వారంద‌రినీ ఒకేతాటిపైకి తీసుకువ‌స్తాన‌న్నారు. రాజ‌కీయంగా తాము వేరైన‌ప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చేస‌రికి అంద‌రూ ఒక్క‌టేన‌ని, ఆయ‌న‌కు సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని న‌టుడు నాగ‌బాబు ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag