ఈనెల 23 నుండి టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని దేశాల నుండి క్రీడాకారులు ఒలంపిక్స్ నగరానికి చేరుకున్నారు. మన దేశం నుండి కూడా పలువురు క్రీడాకారులు టోక్యో ఒలంపిక్స్ కోసం సిద్ధమయ్యారు. కాగా ఈ ఏడాది మనదేశం నుండి వెళ్ళిన క్రీడాకారులను ప్రభుత్వాలు ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పతకాలు సాధించిన వారికి భారీ నజరానా లు కూడా ప్రకటించాయి. 

అయితే తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమ రాష్ట్రానికి చెందిన.. దేశం తరపున ఒలంపిక్స్ లో పాల్గొంటున్న బాక్సర్ లవ్ లీనా బార్గోహైన్ కు మద్దతు తెలుపుతూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు అపోజిషన్ పార్టీ సభ్యులు కూడా కలిసి రావడం విశేషం. వీరంతా కలిసి 7 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. అయితే సీఎం పక్కన సెక్యూరిటీ సిబ్బందిపై పరిగెత్తుతూ ఉండటం తో సీఎం పై విమర్శలు వస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: