తెలంగాణ సచివాలయంలో సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కోసం సెక్రెటరియేట్ లోని పేషీని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సంప్ర‌దిస్తున్నారు. అత్యవసరం కోసం ఎవరైనా సచివాలయంలో ఉన్న నెంబర్‌కు సంప్రదిస్తే కాంటాక్ట్ నెంబ‌రు ఇచ్చేవారు. అధికారులేమో సైట్‌లో పాత నెంబ‌ర్లే ఉంచారు. ప్ర‌జ‌లు కూడా ఆనెంబ‌ర్ల‌లోనే సంప్ర‌దిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సంబంధిత కార్యాలయాల‌కు   బిఆర్కే భవన్,  సీఎం పేషీ అధికారులు స‌మాచారం అందిస్తున్న‌ప్ప‌టికీ ఇత‌ర శాఖ‌లు స్పందించడంలేద‌ని ఆరోప‌ణ‌లొస్తున్నాయి. ఫిర్యాదులు ఇస్తున్న‌ప్ప‌టికీ అవి ఎందుకు ప‌రిష్కారం కావ‌డంలేదా అని ప్ర‌జ‌లు కూడా త‌ల‌లు బ‌ద్ద‌లుకొట్టుకుంటున్నారు. స‌మ‌స్య‌ను వారం రోజుల్లోగా గ‌తంలో ప‌రిష్క‌రించేవారు. సోమ‌వారం ఫిర్యాదుచేస్తే స‌రిగ్గా వారానిక‌ల్లా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ముఖ్య‌మంత్రే ఆదేశాలిచ్చారు. అయితే క్ర‌మేణా అధికారులు, సిబ్బంది నాన్చుడు ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంవ‌ల్ల ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ప‌రిష్కారం కాకుండా ఉండిపోయాయ‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag