తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ నాలుగు ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల‌ను కూడా తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకా అయిన‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఏర్పాటు చేయ‌డం గమనార్హం. తమ జిల్లాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు కావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఇటీవల నారాయణపేట జిల్లాలో రెండు మండలాలలో మరియు వికారాబాద్ జిల్లాలో ఒక మండలం లో కాలేజీల‌ ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ ,మహేశ్వరం, పరిగి, ఉప్పల్ లో నూతన కాలేజీల‌ను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: