పార్టీ ఆఫీసులో నాలుగు బల్లలు కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లా అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీ రామారావును సీఎం కుర్చీ నుండి దించినప్పుడు ప్రజాస్వామ్యం చంద్రబాబుకు గుర్తుకు రాలేదా అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పిలుపునిస్తే రాష్ట్రంలో కనీసం బడ్డీకొట్టు కూడా మూయరు..అది ఆయన స్థాయి అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. 420 చంద్రబాబు 350 ఆర్టికల్ ను ప్రయోగించి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పడం జోక్ గా ఉంది అంటూ కొడాలి వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా ఈ దాడిని తాను ఖచ్చితంగా సమర్థిస్తాను అంటూ కామెంట్ చేశారు. పట్టాభి ఒక ఊరపంది అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సంగతి చూడడానికి నన్ను ఒక్కడిని వదిలేస్తే చాలు అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పట్టాభి లని చెప్పుతో కొట్టాలి అంటూ కొడాలి నాని ఘాటు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన నాటి నుండి రాష్ట్రం రావణ కాష్టం లా రగులుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: