శ్రీ‌వారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ నెల‌ల‌కు సంబంధించిన రూ.300 టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 12వేల చొప్పున టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది టీటీడీ. రేప‌టి నుంచి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అవి రోజుకు 10వేలు చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. నవంబ‌ర్ నెల‌కు సంబంధించిన గ‌దుల బుకింగ్‌ను ఈనెల 25 నుండి అందుబాటులోకి ఉంచ‌నుంది.

స్వామివారి ద‌ర్శ‌నానికి సంబంధించిన రూ.300 ప్ర‌త్యేక‌ద‌ర్శ‌నం, టైంస్లాట్ స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల‌ను, గోవింద యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాల‌ని సూచించింది. ఒక‌వేళ రూ.300 టోకెన్లు ల‌భించ‌క‌పోయినా స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు తీసుకోవాల‌ని అధికారులు వెల్ల‌డించారు.  మ‌రోవైపు తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌ను టీటీడీ అలెర్ట్ చేసిన‌ది. కొన్ని కొత్త నిబంధ‌న‌లు అమ‌లులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి శ్రీ‌వారి భ‌క్తులు రెండుడోసులు పూర్త‌యిన స‌ర్టిఫికెట్‌, మూడు రోజులకు ముందు క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ తీసుకురావాల‌ని సూచించింది. క‌రోనా క‌ట్టడి కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది టీటీడీ. ఇందుకు భ‌క్తులంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: