ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ చేసిన అణుచిత వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే అరెస్టు చేసిన విష‌యం విధిత‌మే. నిన్న ప‌ట్టాభికి ఆసుప్ర‌తిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. కోర్టు నుంచి మ‌చిలీప‌ట్నం త‌ర‌లించారు. తాజాగా ప‌ట్టాభిని మచిలీ ప‌ట్నం నుంచి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు పోలీసులు.

మ‌చిలీప‌ట్నం నుంచి ప్ర‌త్యేక బందోబ‌స్తు మ‌ధ్య వాహ‌నాల‌లో రాజ‌మండ్రికి చేరుకున్నారు. రిమాండ్ నిమిత్తం సెంట్ర‌ల్ జైలు అధికారుల‌కు ప‌ట్టాభిని అప్ప‌గించ‌నున్న‌ట్టు కృష్ణాజిల్లా పోలీసులు వెల్ల‌డించారు. గురువారం  విజ‌య‌వాడ అద‌న‌పు చీఫ్ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. విచారించిన న్యాయాధికారి ఏసీపీ వాద‌న‌ల‌తో ఏకీభ‌విస్తూ ప‌ట్టాభికి న‌వంబ‌ర్ 02 వ‌ర‌కు రిమాండ్ విధించారు.  ప‌ట్టాభి మ‌చీలిప‌ట్నం నుంచి  రాజ‌మండ్రికి త‌ర‌లిస్తున్నారనే విష‌యం ఉద‌యం నుంచే ప్ర‌చారం కావ‌డంతో ప‌లువురు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు వ‌ద్ద‌కు వెళ్లారు. ప‌ట్టాభిని బందోబ‌స్తు మ‌ధ్య తీసుకురావ‌డంతో చూడ‌డానికి ఎవ‌రినీ అనుమ‌తించ‌లేదు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: