తెలంగాణ ఆర్టీసీ న‌ష్టాల్లో ఉన్న విష‌యం విధిత‌మే. న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో  పెట్ట‌డం కోసం తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ఒక కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పేంచేందుకు  స‌జ్జ‌నార్ నూత‌న ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు. శుభ‌కార్యాల‌య సంద‌ర్భంలో ఆర్టీసీ బ‌స్సులు సామాన్యుల‌కు అందుబాటులో ఉండేందుకు మ‌రొక నిర్ణ‌యం తీసుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ఆర్టీసీ బ‌స్సుల‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు.  దీనిని తాజాగా స‌జ్జ‌నార్ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు.

 పెండ్లిలు, ప‌లు వేడుక‌లు, దూర ప్రాంతాల‌కు సంబంధిచిన టూర్లు, త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌లో బృందాల‌కు వెళ్లేందుకు ముందుగా అడ్వాన్స్ రూపంలో ఇచ్చే సెక్యూరిటీ డిపాజిట్ చేయ‌కుండానే బ‌స్సుల‌ను బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు వీసీ స‌జ్జ‌నార్‌. ఆర్టీసీ బ‌స్సుల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకే ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన‌ట్టు వివ‌రించారు. బ‌స్సు అవ‌స‌ర‌మైన వారు స‌మీప డిపో మేనేజ‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు. అదేవిధంగా 040-30102829, 040-68153333 ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి పూర్తి స‌మాచారం పొంద‌వ‌చ్చ‌ని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: