జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి సీరియస్ గానే రెడీ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు విశాఖ ఉక్కు మీద పోరాటం చేసేందుకు ఆయన సిద్దమైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల 31న విశాఖ కు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపధ్యంలో ఏ పరిణామాలు ఉంటాయో అనే ఆసక్తి అందరిలో ఉంది.

గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్న జనసేనాని... చేసే వ్యాఖ్యలపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 31 మధ్యాహ్నం రెండు గంటలకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ హాజరు అవుతారు అని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి పవన్ మద్దతుతో కార్మికుల్లో ఆశలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: