హైదరాబాద్ లో కత్తి దాడికి గురై ఆస్పత్రి లో చికిత్స పొందుతూ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి చెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. రవీందర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన అల్లుడు మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. తీవ్ర గాయాలతో అపోలో లో చికిత్స పొందుతూ మరణించిన రవీందర్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియకు తరలించారు అని తెలుస్తుంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేసారు రవీందర్ రెడ్డి. రెండేళ్ల కిందట బేగంపేట ప్రాంతంలో దాదాపు 600 గజాల స్థలాన్ని కొనుగోలు  చేసారు. స్థలం కొనుగోలు లో మధ్యవర్తిత్వం వహించారు మోహన్ రెడ్డి. తనకు రావాల్సిన కమిషన్ డబ్బులు ఆరు లక్షలు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తన కమిషన్ ఇవ్వకుండా రెండు నెలల క్రితం రవీందర్ రెడ్డి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఆగ్రహం తో ఊగిపోయాడు. దీంతో హతమార్చలని భావించి కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts