కర్ణాటక రాష్ట్రంలోని  బెంగళూరులో విషాదకరమైన‌ సంఘటన చోటుచేసుకున్న‌ది.  ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వెల్ల‌డించిన వివరాలు.. అశ్ప‌క్ త‌గ‌డి(24) శివ‌మొగ్గ జైలులో జైలు వార్డెన్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. సంవ‌త్స‌రం క్రిత‌మే ఉద్యోగానికి సెల‌క్ అయి ఉద్యోగంలో చేరాడు. ఈ త‌రుణంలోనే తాజాగా భార్య‌కు వీడియో కాల్ చేశాడు. ఏమైందో ఏమో తెలియ‌దు ఉన్న‌ట్టుండి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాను అని తెలిపాడు. దీంతో భార్య భ‌య‌ప‌డింది. ఆమె అత‌నితో వారించింది.

అయినా అత‌ను ప‌దే ప‌దే ఆత్మ‌హ‌త్య గురించి ప్ర‌స్తావించ‌డంతో భార్య తీవ్రంగా భ‌య‌ప‌డి ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం చేర‌వేసిన‌ది.  అధికారులు అశ్ప‌క్ ఇంటికి చేరుకుని ఇంటి త‌లుపు బ‌ద్ద‌లు కొట్టి లోప‌లికి ప్ర‌వేశించి చూడ‌గా.. అప్ప‌టికే ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు గుర్తించారు పోలీసులు. శివ‌మొగ్గ‌లో అశ్ప‌క్‌కు అధికారులు తొలి పోస్టింగ్ ఇచ్చారు. అత‌ని ఆత్మ‌హ‌త్య చేసుకోవడానికి గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేదు. పోలీసులుకేసు న‌మోదు చేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: