సురక్షితంగా ప్రయాణం ఆర్టీసీ బస్సుతోనే సాధ్యం అని, మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సు వెళ్తుందని గుర్తుచేశారు. ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఫోన్ చేస్తే వారి వద్దకే వెళ్లి బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. బస్టాండ్ ఆవరణలో, ఆర్టీసీ ఆస్తులపై సినిమా, అనుమతి లేని పోస్టర్లు అంటించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. పోస్టర్లపై ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లో కేసులు నమోదు కూడ చేశాం అని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా మరో వారం రోజుల్లోనే ఆర్టీసీ ఛార్జీలను పెంచనున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆర్టీసీని గాడి పెట్టి.. పూర్వవైభవం తీసుకురావడం కోసం సజ్జనార్ ముందుకు సాగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి