క‌రోనా సెకండ్ వేవ్  త‌గ్గిపోవ‌డంతో ఇప్ప‌టంత‌లో థ‌ర్డ్ వేవ్ ముప్పు అంత‌గా ఏమి లేదని భావిస్తున్న త‌రుణంలోనే కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు గుబులు పుట్టిస్తోంది. ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా వంటి దేశాల‌లో క‌రోనా కొత్త వేరియంట్ బీ.1.1.529 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వైర‌స్ ధాటికి వ‌ణుకు పుడుతున్న‌ది.
 
బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, చెక్ రిప‌బ్లిక్‌, ఇజ్రాయెల్‌, సింగ‌పూర్ వంటి దేశాలు  స‌ద‌ర‌న్ ఆఫ్రికా దేశాల‌పై ట్రావెల్ బ్యాన్ చేసాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మైంది. రేపు  ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం కానున్నారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు, టూరిస్టుల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు మంత్రి. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్నీ రాష్ట్రాల‌ను, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన విష‌యం విధిత‌మే. సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు విమాన స‌ర్వీసులు లేని కార‌ణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చే వారిని ట్రేసింగ్ కు సంబంధించి ఉన్న‌తాధికారుల‌తో మంత్రి హ‌రీశ్‌రావు చ‌ర్చించ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: