అఖండ ప్రీ రిలీజ్ వేడుక‌కు బాల‌య్య విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి ప్రాంగ‌ణం అంతా జై బాల‌య్య అంటూ నినాదాల‌తో హోరెత్తిపోయింది. ఆయ‌న చేయికి క‌ట్టుకున్నారు. శివ నామాలు ధ‌రించి ఇక్క‌డికి విచ్చేస్తూ అంత‌టి సంద‌డిలోనూ ఓ మ‌హిళా అభిమాని ఇరుక్కుపోతే వెంట‌నే స్పందించి ఆమెకు ఆమె బిడ్డ‌కు వారి బంధువుకూ దారి ఇచ్చి త‌రువాత ఆయ‌న స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు అభివాదం చేశారు. చిత్ర సాంకేతిక నిపుణులు వ‌చ్చి ఆయ‌న‌ను ప‌ల‌క‌రించి వెళ్లారు. చాలా మంది అభిమానులు వ‌చ్చి క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తే వాళ్లంద‌రినీ ప‌ల‌క‌రించారు. బాల‌య్య ను ముందుగా తెలుగు భాష కు ప్ర‌తీక అంటూ యాంక‌ర్ సుమ అన్నారు. అలానే ఈ సినిమాలో ప్ర‌తి సంభాష‌ణ కూడా మంచి స్థాయిలో ఉంటాయ‌ని కూడా  చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్ప‌టికే పిల్ల కాలువ డైలాగ్ పెద్ద హిట్జ‌. చాలా బాగుంది ఈ డైలాగ్ అని అభిమానులు విజిళ్ల‌తో హోరెత్తిస్తున్నారు విన్న ప్ర‌తీసారి..! ఇప్పుడే డ్ర‌మ్మ‌ర్ శివ‌మ‌ణి పెర్ఫార్మెన్స్ మొద‌ల‌యింది.

 
అదేవిధంగా ఈ వేడుకకు అతిథులుగా ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ విచ్చేయ‌నున్నారు. ఈ వేడుక‌లో బాల‌య్య సినిమాల్లో డైలాగులు చెప్పి యాంక‌ర్ సుమ అభిమానుల‌ను ఎంత‌గానో ఉర్రూత‌లూగిస్తుండ‌డం విశేషం. ఇక ఈ చిత్రాన్ని మిరియాల ర‌వీంద్ర రెడ్డి నిర్మించ‌గా, బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: