వైఎస్ వివేక హ‌త్యా కేసు రోజుకొక కీల‌క మ‌లుపు తిరుగుతోంది. తాజాగా అనంత‌పురం ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌ను గంగాధ‌ర్ రెడ్డి క‌లిసారు. సీబీఐ, వివేకా అనుచ‌రుల నుంచి త‌న‌కు ప్రాణ‌హానీ ఉన్న‌ద‌ని ఫిర్యాదు చేసారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎస్పీని కోరాడు బాధితుడు గంగాధ‌ర్ రెడ్డి. రూ.10కోట్లు ఇస్తామ‌ని సీబీఐ ఆఫ‌ర్ చేసింద‌ని వెల్ల‌డించాడు. వివేకా హ‌త్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్క‌ర్‌రెడ్డిలు ముఖ్యంగా దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని చెప్పాల‌ని సీబీఐ ఒత్తిళ్ల‌ను తీసుకొచ్చింద‌ని.. తానే చంపిన‌ట్టు ఒప్పుకోవాల‌ని సీబీఐ అధికారులు బెదిరించార‌ని చెప్పారు గంగాధ‌ర్‌రెడ్డి.

ముఖ్యంగా వైఎస్ వివేకా హ‌త్య‌లో నాకు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసారు. అయితే తానే హ‌త్య చేసిన‌ట్టు ఒప్పుకోవాల‌ని చెప్పార‌ని, సీబీఐ అధికారులు రూ.10 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు. రెండు వారాల క్రిత‌ము సీబీఐ అధికారులు వ‌చ్చార‌ని చెప్పారు. ఇప్ప‌టికే సీబీఐ నుంచి నాకు 24 వ తేదీన నోటీసులు పంపించార‌ని, క‌డ‌ప‌లో ఈనెల 20వ తేదీన క‌లిసిన‌ట్టు వివ‌రించారు. ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేద‌ని.. నాకు దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డికి మ‌ధ్య అనుబంధం ఉన్న‌దని, అందుకోసమే సీబీఐ అధికారులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: