ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, గ‌వ‌ర్న‌ర్ రోష‌య్య మృతి చెందిన విష‌యం తెలుసుకోగానే ప‌లువురు నేత‌లు ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుని సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా  రోశయ్య కుమారుడితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడి  మృతికి సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకున్నారు.  ఇక ఈ విష‌యం తెలిసిన వెంట‌నే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు  బయలుదేరారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోశయ్య నివాసానికి రేవంత్ రానున్న‌ట్టు చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లంద‌రూ  ఒక్కొక్క‌రుగా రోశ‌య్య నివాసానికి చేరుకుంటున్నారు. రోశయ్య మృతి పట్ల  కాంగ్రెస్ నాయకులు పలువురు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు ఉద‌యం 10 గంట‌ల నుంచి  10.30 గంట‌ల మ‌ధ్య రోశ‌య్య ఇంట్లో పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.  ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంటి వ‌ద్ద నుంచి బ‌య‌లు దేరి గాంధీ భ‌వ‌న్ కు పార్థివ‌దేహాన్ని త‌ర‌లించి.. అక్క‌డ 1 గంట‌ల వ‌ర‌కు కాంగ్రెస్ నాయ‌కులు, అభిమానులు సంద‌ర్శ‌నార్థం ఉంచ‌నున్నారు. ఆ త‌రువాత గాంధీభ‌వ‌న్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లో ఉన్న మ‌హాప్ర‌స్థానంలో రోశ‌య్య అంత్య‌క్రియ‌లు ఆదివారం మ‌ధ్యాహ్నం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: