ప్ర‌స్తుతం టెలికాం రంగంలో అన్నింటి ధ‌ర‌లు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతున్నాయి. రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థ‌లు టారిఫ్ ధ‌ర‌ల‌ను పెంచేసాయి. ఇప్ప‌టికే పెరిగిన రేట్లు డిసెంబ‌ర్ 01 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన విష‌యం విధిత‌మే. తాజాగా జియో యూజ‌ర్ల‌కు మ‌రొక షాక్ త‌గిలిన‌ది. ఒక సాధార‌ణ ప్లాన్‌తో పాటు ఓటీటీ స‌ర్వీస్ ధ‌ర‌ల‌ను సైతం జియో పెంచేసిన‌ది.

డిస్ని+హాట్‌స్టార్ ప్లాన్‌ల ధ‌ర‌ల‌ను కూడా పెంచిన‌ది జియో. ఓటీటీ ప్రేక్ష‌కుల కోసం ప‌లు టెలికాం కంపెనీలు ఓటీటీ రీచార్జ్ పాన్‌ల‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ‌త వారం టారిఫ్ ధ‌ర‌ల‌ను 20 శాతం వ‌ర‌కు పెంచిన జియో తాజాగా డిస్ని+హాట్‌స్టార్ మొబైల్ స‌ర్వీస్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధ‌ర‌ల‌ను కూడా పెంచిన‌ది.  

 రిల‌య‌న్స్ జియో ఐదు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల‌పై డీస్ని+హాట్‌స్టార్ స‌ర్వీసుల‌ను కూడా అందిస్తున్న‌ది. దాదాపు సంవ‌త్స‌ర కాలంపాటు డీస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సాధారణ అన్‌లిమిటెడ్‌ డేటా పొందొచ్చు. తాజాగా రూ.499 ప్లాన్ ధ‌ర‌ను రూ.601 పెంచిన జియో.. అదేవిధంగా రూ.666 ఉన్న ప్లాన్ ధ‌ర రూ.799కు చేరుకుంది. అలాగే రూ.888 ప్లాన్ ధ‌ర‌ను రూ.1066 పెంచిన జియో.. రూ.2599 ధ‌ర రూ.3119 పెంచేసింది. అదేవిధంగా రూ.549 ప్లాన్ ధ‌ర రూ.659కు చేరుకున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: