తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన త‌రువాత  స్టాలిన్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నారు.  కొన్ని సందర్భాల్లో అందరినీ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యంలో ముంచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇవాళ మరొక‌ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌.  రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారికి సాయం  అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసారు.  కరోనా బారినపడి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.50 వేలు ఇవ్వాలని ఆదేశాల‌లో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 2,800 మందికి పైగా మృతిచెందినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విప‌త్తు ప్ర‌తి స్పంద‌న నిధి నుంచి ఈ సాయాన్ని అందించ‌నున్నారు స్టాలిన్‌. సెప్టెంబ‌ర్ 03, 2021 ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మ‌రియు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ సంయుక్తంగా జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం కొవిడ్‌-19తో మృతి చెందిన‌ట్టు ధృవీక‌రించబ‌డిన వారికే ఈ ప‌రిహారం అంద‌నున్న‌ది. ఈ ఎక్స్‌గ్రేసియా సాయం భార‌త్‌లో మొద‌టి కేసు న‌మోదు అయినప్ప‌టి నుంచి వ‌ర్తిస్తుంద‌ని ఉత్త‌ర్వుల‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: