హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.  రాజేంద్ర‌న‌గ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తమ‌కు ఉన్న  ఇద్ద‌రు చిన్నారుల‌ను క‌న్న త‌ల్లి క‌డ‌తేర్చిన‌ది. క‌న్న‌పేగు బంధాన్ని తెంచుకోవ‌డంతో పాటు ఆమె కూడా తిరిగిరాని లోకాల‌కు వెళ్లింది. నిత్యం క్రైమ్ లో రాజేంద్ర‌న‌గ‌ర్ నిల‌వ‌డం ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌లే ఓ చిన్నారి అదృశ్య‌మై.. శ‌వ‌మై తేల‌డం మ‌ర‌వ‌క ముందే.. నిన్న  భ‌ర్త భార్య‌పై అనుమానంతో త‌ల న‌రికి త‌ల‌తో పాటు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు. ఆ  ఘ‌ట‌న గ‌డిచి 24 గంట‌లు దాట‌క ముందే మ‌రొక ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్‌లో పార్వ‌తి అనే మ‌హిళ త‌న‌కు ఉన్న ఇద్ద‌రు చిన్నారులు శ్రేయ‌, త‌న్విఖిల‌కు ఉరి వేసి చంపి.. ఆ త‌రువాత ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృతికి చెందడానికి గ‌ల కార‌ణాలను ఆరా తీస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్న రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: