టీడీపీ అధినేత చంద్రబాబు కరనా నుంచి పూర్తి గా కోలుకున్నారు. ఈ నెల 18వ తేదీన చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఆ రోజు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పటి నుంచి చంద్రబాబు.. ఉండవల్లిలోని తన నివాసంలోనే ఉంటున్నారు. పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉంటూ కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.


అంతకుముందే.. నారా లోకేశ్‌ కరోనా బారిన పడ్డారు. టీడీపీ అగ్రనేతలిద్దరూ కరోనా బారిన పడటంతో పార్టీ శ్రేణులు కాస్త కలవరపడ్డాయి. అయితే.. స్వల్ప లక్షణాలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేవని చంద్రబాబు పార్టీ శ్రేణులకు తెలిపారు. ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలపై మరింతగా దృష్టి పెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30గంటలకు చంద్రబాబు తన నివాసంలో నిజానిర్ధారణ కమిటీ సభ్యులు, ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. గుడివాడ క్యాసినోపై కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: