ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ పై విమ‌ర్శ‌లు చేసార‌నే ఆరోప‌ణ‌ల‌తో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌ను సోమ‌వారం సాయంత్రం స‌మ‌యంలో అరెస్ట్ చేసిన విష‌యం విధిత‌మే. అయితే అమ‌రావ‌తి వ‌న్‌టౌన్ పోలీస్ స్టేష‌న్ నుంచి సోమ‌వారం అర్థ‌రాత్రి బుద్ధా వెంక‌న్న బెయిల్‌పై విడుద‌ల అయ్యారు. స్టేష‌న్ బెయిల్ ఇచ్చి ఆయ‌న‌ను విడుద‌ల చేసారు పోలీసులు. రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌సంగం చేసినందుకు సెక్ష‌న్ 153 ఏ, భ‌యోత్సాతం సృష్టించినందుకు సెక్ష‌న్ 506 మ‌త‌, ప్రాంతాయ విద్వేషాలు రెచ్చ‌గొట్టే విధంగా వ్య‌వ‌హ‌రించారు అని 505(2) రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు న‌మోదు చేసారు.

పోలీస్ స్టేష‌న్‌లో బుద్ధా వెంక‌న్న‌ను సుమారు 7 గంట‌ల పాటు పోలీసులు విచారించిన‌ట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత బుద్ధా వెంక‌న్న మీడియాతో మాట్లాడారు. అన్ని విష‌యాలు మంగ‌ళ‌వారం ఉద‌యం మీడియాకు చెప్తాన‌న్నారు. పోలీసులు త‌న‌ను అడిగిన విష‌యాల గురించి.. త‌గ్గ‌బోను అని స్ప‌ష్టం చేసారు. అంశంలో ఎలాంటి పోరాటానికి అయినా తాను సిద్ధంగా ఉండాన‌ని బుద్ధా వెంక‌న్న వెల్ల‌డించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: