నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. దాదాపు గంటన్నర సేపు ఆయన అనర్ఘళంగా ప్రసంగించారు. ఈ దేశంలో బీజేపీ సర్కారు ఎన్ని దుర్మార్గాలు చేస్తుందో అంటూ సోదారహరణంగా వివరించారు. మోడీ వంటి ప్రజాకంటక పాలకుడిని ఎలా తరిమికొట్టాలో చెప్పుకొచ్చారు. అయితే.. ఈ ప్రెస్‌ మీట్‌ పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విభిన్నంగా స్పందించారు.

దెయ్యాలు వేదాలు వల్లించడం ఎలాగో తెలియాలంటే కేసీఆర్‌ గారి ప్రెస్ మీట్ చూడండంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో  సెటైర్‌ పేల్చారు. తనలాంటి దయ్యాల దుమ్ము ఎలా దులపాలో దొరగారు వివరించి చెప్పారని వైఎస్ షర్మిల వ్యంగ్యంగా చెప్పారు. షర్మిల తరచుగా కేసీఆర్, కేటీఆలపై విరుచుకుపడుతున్నారు. అయితే.. ఆమె విమర్శల వరకూ బాగానే ఉన్నా.. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ ఎదుగుదల మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఒకటి, రెండు దీక్షలు చేయడం మినహా ఆమె కార్యకలాపాలు కూడా పెద్దగా ఉండటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: